ఉగాది అంటే ఏమిటి ఉగాది ఎందుకు జరుపుకుంటాం

ఉగాది అంటే ఏమిటి ఉగాది ఎందుకు జరుపుకుంటాం

0
211

మన తెలుగు వారికి సంవత్సరాదిగా ఉగాదిని చెప్పుకుంటాం… మనకు పంచాంగ శ్రవణం కూడా చేస్తారు..ఉగస్య ఆది అనేదే ఉగాది. ఉగఅనగా నక్షత్ర గమనము అని అర్దం, జన్మ ఆయుష్షు అని అర్థాలు. వీటికి ఇక ఆది అనగా మొదలు అని అర్ధం అందుకే ఉగాది జన్మకి మొదటిదిగా చెబుతారు.

ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ద్వయ సంయుతం యుగం అంటారు అంటే సంవత్సరం అని అర్ధం. ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది అయింది.భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే ఉగాది పండుగ చేసుకుంటారు

ఆనాడు సృష్టి వచ్చింది అని చెబుతారు సూర్యుడ్ని కూడా ఈరోజు అందరూ పూజిస్తారు. అలా ప్రతీ ఏడాది ఈ రోజు ఇలా ఉగాది జరుపుకుంటారు, ఆరోజు షడ్రుచులపచ్చడి తింటారు, లక్ష్మీ దేవిని కూడ పూజిస్తారు..