ఉగాది అంటే ఏంటో తెలుసా…

ఉగాది అంటే ఏంటో తెలుసా...

0
117

తెలుగు వారి పండుగ ఉగాది ఈ పండుగ… తెలుగువారు నూతన సంవత్సరంగా పిలుస్తారు… ప్రపంచ వ్యాప్తంగా జనవరి 1 నూతన సంవత్సరం అయితే తెలుగు వారికి ఉగాది పండుగతో నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది… తెలుగు వారు నూతన అలాగే ఉగాది పండుగను ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు అయితే ఉగాది అంటే ఏంటీ దాని మీనింగ్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం…. ఉగస్య ఆది అనేదే ఉగాది. ఉగ… అంటే నక్షత్ర గమనము జన్మ ఆయుష్షు అని అర్థం. ఇక ఆది అంటే మొదలు…..

ఉగాది ప్రపంచము యొక్క జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అంటారు…ఇంకొక విధంగా చెప్పాలంటే, యుగము అనగా రెండు లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం యుగం సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది యుగాది అయింది.

అదే సంవత్సరాది ఉగాది వసంతములకు గల అవినాభావ సంబంధము, మరియు సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపము….భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది.