ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలి తెలుసుకోండి

ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలి తెలుసుకోండి

0
126

ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగ ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలు దేవాలయాలకు వెళతారు.. ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకుని అందరికి పంచుతారు, అయితే ఇది ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా తయారు చేస్తారు.. మరి ఎలా ఉగాది పచ్చడి చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.

ఇందులో తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలపి చేస్తే అది ఉగాది పచ్చడి అవుతుంది, వేపపువ్వు కొద్దిగా తీసుకోవాలి, చిన్న చెరకు ముక్క తీసుకోండి, అలాగే కొబ్బరి తురుము, అరటిపళ్లు నాలుగు, చింతపండు 25 గ్రాములు , చిన్నమామిడికాయ, బెల్లం 100 గ్రాములు తీసుకోవాలి..

పచ్చి మిరపకాయ – 1..ఉప్పు తగినంత నీళ్లు సరిపడా తీసుకోవాలి, ముందుగా చెరకు బెల్లం నీరు మిర్చి మామిడికాయ ముక్కలు అన్నీ కలపాలి బెల్లం కరుగుతూ ఉంటుంది.. ఈ సమయంలో అరటిపండు గుజ్జుగా చేసుకోని అందులో కలుపుకోవాలి, ఆ తర్వాత వేప పువ్వు అందులో వేయాలి, చింతపండు గుజ్జు అందులో వేసి కలుపుకోవాలి. తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోవాలి.. ఇలా అన్ని రుచులు ఇందులో వస్తాయి, కొత్త కుండ కొనుక్కోని అందులో ఉగాది పచ్చడి చేసుకుంటే మంచిది.