ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారో తెలుసా

ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారో తెలుసా

0
143

ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి చేస్తారు.. ఈ పచ్చడి చుట్టుపక్కన ఉన్నవారికి ఇస్తారు… కొత్త సంవత్సరం రోజు అడుగుపెడుతున్నందున కొత్తగా పండిన మామిడి వేపాకు వేప పూత బెల్లం వంటి వాటితో ఉగాది పచ్చడి చేశారు…

ఉగాది పచ్చడికి కావలసిన పదార్డాలు: వేప పువ్వు-1కప్పు, బెల్లంపొడి-1కప్పు, కొబ్బరికోరు-1కప్పు, బాగాముగ్గిన అరటి పండ్లు-6, మామిడికాయ-1, కొత్తకారము-చిటెకెడు, ఉప్పు-అరస్పూను, శనగట్నాల) పప్పు పొడి-1కప్పు, చింతపండు-నిమ్మకాయంత, కొద్దిగా చెరుకుముక్కలు, వేయించిన వేరుశనగపప్పు-అరకప్పు చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి.

అరటిపండు తొక్కలు తీసి చిన్నముక్కలుగా తరగాలి. మామిడికాయ తొక్కతీసి చిన్నముక్కలుగా తరగాలి. చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగేవరకు కలపాలి. వేపపువ్వు తప్పించి మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేపపువ్వు కలపాలి.