ఉగాది రోజు ధనవంతులు చాలా మంది పేదలకు డబ్బులు అలాగే బట్టలు ధానం చేస్తారు.. వివాహం చేసుకునే వారికి కొత్త కాపురానికి సామాన్యులు సాయం చేస్తారు… అలాగే పంటలో వచ్చిన ఆదాయంలో 20 శాతం దానంచేసే వారు ఉంటారు.
అయితే వేసవి కాలం ప్రారంభం అవుతుంది కాబట్టి చలివేంద్రాల దగ్గర కొత్త కుండలు దానం చేస్తే చాలా మంచిది అని… ఆనాటి నుంచి పెద్దలు చెప్పిన మాట, ఉగాదినాడు చెప్పులూ, గొడుగులు కూడా దానం చేయాలన్నది పెద్దల మాట. ఉగాది రోజున కొందరు ధర్మకుంభదానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెబుతారు.
ఇలా చేస్తే వారి కుటుంబం ధనంతో ఆరోగ్యంతో ఉంటుంది అంటారు. ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అన్నా ఇది చాలా మంచిది …ఇక కిరాణా ఫ్యాన్సీ వ్యాపారాలకు ఇది మంచి సమయం అంటారు, ఇక మామిడి కాయలు వేప పువ్వు పచ్చడి తయారు చేసి అందరికి పంచితే, ఆ కుటుంబంలో శాంతి ఉంటుందని చెబుతారు.