వెయ్యి కేసులు పెట్టినా వెనకడుగు వేయం : దాసోజు శ్రవణ్

0
52

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మీద వెయ్యి కేసులు పెట్టుకున్నా సర్కారుపై పోరాటం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఎఐసిసి అధికార ప్రతినిథి దాసోజు శ్రవణ్.

ఖైరతాబాద్ లోని బడా గణేష్ సమీపంలో సర్కార్ హాస్పిటల్ ను10కోట్ల తో కాంగ్రెస్ సర్కార్ నిర్మించిందని గుర్తు చేశారు. అందులో 50 బెడ్ల సామర్థ్యం వున్నా.. 100 బెడ్ల వరకు పెంచవచ్చన్నారు. దాన్ని కోవిడ్ రోగులకు వైద్యం కోసం వాడుకోవాలని చెబుతున్నా ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే.. లాస్ట్ వీక్ కాంగ్రెస్ నేతలు హాస్పిటల్ విజిట్ చేశారని అన్నారు. ఐతే.. తెలంగాణ సర్కార్ తమపై కేసులు పెట్టింది కానీ పాత బస్తీలో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంట్లో పెళ్లి వేడుకలో వెయ్యి మంది హాజరైనా కేసులు లేవన్నారు.

ఆ వేడుకలకు హోం మంత్రి, డిజిపి కూడా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి అటెండ్ అయ్యారన్నారు.

టీఆరెస్ లీడర్స్ కోవిద్ రూల్స్ పట్టించకుండా.. ఏమైన చేసుకోవచ్చా అని ప్రశ్నించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. విరించి హాస్పిటలపై ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు.

మాపై వెయ్యి కేసులు పెట్టుకున్నా.. మా పోరాటం ఆగదు అని హెచ్చరించారు దాసోజు.