ఆంధ్రాలో స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసులు : మరణాలు వంద లోపే

0
102

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ కోవిడ్ వైరస్ శాంతించినట్లే కనబడుతోంది. పక్క రాష్ట్రమైన తెలంగాణలో కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువగా కోవిడ్ కేసులు ఎపిలో నమోదవుతూ ఆందోళన కలిగిస్తన్నాయి. మరణాలు సైతం తెలంగాణ కంటే ఐదారు రెట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి.

శనివారం కోవిడ్ కేసుల వివరాలు చూస్తే…

పాజిటివ్ రేటు 25 శాతం నుంచి 11.7శాతానికి తగ్గింది.

నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం 10 గంటల వరకు 88,441 నమూనాలు పరీక్షించగా 10,373 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.

మరణాలు 80 సంభవించాయి. వందలోపు మరణాల సంఖ్య రావడం ఊపిరిపీల్చుకునే పరిస్థితి ఉన్నట్లే అని వైద్య వర్గాలు అంటున్నాయి. అయినా ఇంకా తగ్గాల్సి ఉందని వారు అంటున్నారు.

జిల్లాల వారీగా ఎక్కువగా నమోదైన మరణాలు చూస్తే…

చిత్తూరులో 12, శ్రీకాకుళం, విజయనగరంలో 9 మరణాలు నమోదయ్యాయి.

అత్యధిక కేసులు తూర్పుగోదావరి జిల్లాలో నమోదయ్యాయి. అక్కడ 1880 కేసులు. మిగిలిన జిల్లాల్లో కేసులు అదుపులోకి వచ్చాయి.

ప్రస్తుతం ఆంధ్రాలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 1,28,108 ఉన్నాయి.

ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 11,376గా నమోదయ్యాయి.

రికవరీ 17.46లక్షలలో 16.07 లక్షల మంది రికవరీ అయ్యారు. 92శాతంగా ఉంది.