జ్వరం వచ్చిన సమయంలో చికెన్ తినవచ్చా వైద్యులు ఏమంటున్నారు

Can chicken be eaten at the time of fever

0
103

మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలడు. ఎంత బలవంతుడైనా చిన్నపాటి జ్వరం వచ్చినా ఇబ్బంది పడతాడు. అందుకే మంచి ఆహారం తీసుకోవాలి ఆనందంగా ఉండాలి అంతేకాకుండా పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి అని చెబుతున్నారు వైద్యులు. నిత్యం బయట ఫుడ్ తింటే అవి అనారోగ్యాలకు దారి తీస్తున్నాయి.మన శరీరంలో రోగనిరోధక శక్తి
పెరిగే ఫుడ్ తీసుకోవాలి.

జ్వరం వచ్చినప్పుడు వైద్యులు కొద్దిగా లైట్ ఫుడ్ తీసుకోమని చెబుతారు. ఎందుకంటే అరుగుదల కొద్దిగా ఉంటుంది అంతేకాకుండా జీర్ణప్రక్రియకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే ప్రశ్న రోగులను వేధిస్తూ ఉంటుంది. అసలు ఈ సమయంలో నాన్ వెజ్ తీసుకోవచ్చా ? చికెన్ తింటే మంచిదేనా అని చాలా మందికి అనుమానం.

ఇక్కడ గుర్తించాల్సింది జ్వరం లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు రక్తంపై అటాక్ చేస్తాయి. ఈ సమయంలో ద్రవాహారం తీసుకోవాలి. సూప్స్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు అలాగే జామ కమలా బొప్పాయి ఇలాంటివి తీసుకోవాలి ఇన్ఫెక్షన్ల ను తట్టుకునేలా చూస్తాయి. మీకు ఇమ్యునిటీ పెరుగుతుంది. లేదా పప్పు ఇలాంటి ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాలి. వైద్యులు చెప్పేది ఏమిటి అంటే జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం తింటే అది మనకు ప్రమాదం. జ్వరం ఉన్న సమయంలో చికెన్ లాంటి ఫుడ్ తింటే పచ్చకామెర్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు జీర్ణ సమస్యలు అరుగుదల సమస్యలు వస్తాయి.