కేటిఆర్ చిట్ చాట్ : ఈటలపై సంచలన కామెంట్స్

0
110

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర బుధవారం తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు సహా అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. ఈటల రాజేందర్ మంత్రి పదవి తొలగింపు మొదలుకొని ఆయన బిజెపిలో చేరడం వరకు ఈనాటి వరకు కూడా కేటిఆర్ ఈ అంశంపై నోరు విప్పలేదు. ఇవాళ తొలిసారి ఈటల గురించి కేటిఆర్ సంచలన కామెంట్స్ చేశారు. కేటిఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చదవండి.

ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ ఎంత గౌరవం ఇచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈటల రాజేందర్ కు టీఆరెస్ లో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలి. మంత్రిగా ఉండి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను బహిరంగంగా తప్పు పట్టారు. మంత్రి వర్గ సమావేశంలో ఈటల ఎపుడైనా అసమ్మతి తెలియ జేశారా ? ఈటల రాజేందర్ తప్పు చేయకుండానే ఒప్పుకున్నారా? ఈటల రాజేందర్ పై సానుభూతి ఎందుకు వస్తది? ఎట్లా వస్తది?

బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలి. ఈటలపై అనామకుడు ఉత్తరం రాస్తే సీఎం చర్యలు తీసుకోలేదు. సాక్షాధారాలు ఉన్నయి కనుకే చర్యలు. ఈటల రాజేందర్ ఆత్మ వంచన చేసుకుంటున్నారు. ఐదేళ్ల కిందట నుంచి కేసీఆర్ తో గ్యాప్ ఉంటే ఎందుకు మంత్రిగా కొనసాగారు? ఐదేళ్ల నుంచి ఈటల రాజేందర్ అడ్డంగా మాట్లాడినా మంత్రిగా కేసీఆర్ ఉంచారన్నట్లే కదా? ఈటల చివరి వరకు పార్టీలో ఉండాలని నేను వ్యక్తిగతంగా ప్రయత్నం చేసాను. సిఎంను కలవను అని ఈటల స్టేట్మెంట్ ఇచ్చిన తరువాత నేను ఏమ్ చేయగలను. ఈటల పార్టీలోకి రాక ముందు కూడా కమలాపూర్ లో బలంగానే ఉన్నది. ఇప్పుడు కూడా హుజురాబాద్ లో బలంగానే ఉన్నది. టీఆరెస్ అభివృద్ధి ని  బీజేపీ ఖాతాలో ఈటల ఎలా వేసుకుంటారు?

హుజురాబాద్ లో వ్యక్తుల మధ్య కాదు పోటీ- పార్టీల మధ్య మాత్రమే. జల వివాదాల్లో న్యాయం గెలుస్తుంది. ఏపీ ఎన్ని కేసులు వేసినా మేము న్యాయబద్ధంగా ముందుకు వెళ్తాము. ఒక్కో వారంలో ఒక్కొక్కరు… వ్రతాలు చేస్తారు. షర్మిల అలా చేస్తోంది. ఈ సీజన్ లో అందరు వ్రతాలు పూజలు చేసినట్టు షర్మిల ఓ రోజు పెట్టుకొని వచ్చి పోతుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైనా మాట్లాడగలుగుతాం. ప్రతిపక్షాలకు ఏమి మాట్లాడాలో తెలియక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. 

టీఆరెస్ పార్టీలో మంత్రి పదవులు అనుభవిస్తూ ఇతర పార్టీల నేతలకు ఈటల టచ్ లోకి ఎలా వెళ్తారు?  అడ్డదిడ్డంగా మాట్లాడి ఆయనకు ఆయనే ఆత్మ వంచన చేసుకున్నారు.