సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
ఎన్నికల నియమావళిలో మార్పులు తెచ్చి రాజకీయ ప్రక్షాళన చేయాలని విజ్ణప్తి
భారత అత్యున్నత న్యాయవ్యవస్థకు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమై తొలిసారిగా హైదరాబాద్ కు విచ్చేసిన జస్టిస్ ఎన్.వి రమణను మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేడు రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమైనందుకు ఆయనకు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ రమణతో ఉన్న అనుబంధంతో ఎన్నికల నియమావళిలో సమూల మార్పులు తీసుకొచ్చి సామాన్యులు సైతం పోటీ చేసే విధంగా రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కోరారు. జస్టిస్ రమణ నేతృత్వంలో భారత న్యాయవ్యవస్థలో మంచి మార్పులు వస్తాయని ఆకాంక్షించారు.