ఈటల రాజీనామాకు ఆమోదం : గంటన్నరలోనే అంతా అయిపోయింది

0
238

రాజకీయ నాయకుడు ఈటల రాజేందర్ ఇప్పుడు మాజీ మంత్రే కాదు… మాజీ ఎమ్మెల్యే గా మారిపోయారు. గంటన్నర వ్యవధిలోనే అన్ని కార్యక్రమాలు చకచకా జరిగిపోయాయి. శనివారం ఉదయం 11.30 గంటలకు ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజవర్గ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కరోనా కారణంగా స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో శాసనసభ కార్యదర్శికి రాజీనామా లేఖ అందజేశారు ఈటల. అయితే అసెంబ్లీ రావడానికి అడ్డమొచ్చిన కరోనా… ఈటల రాజీనామా ఆమోదానికి అడ్డం రాలేదు. గంటర్నరలోనే ఈటల రాజీనామా ఆమోదం తెలిపారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.

అంతేకాదు… ఈటల రాజీనామాను ఆమోదించినట్లు అసెంబ్లీ గెజిట్ కూడా విడుదల చేసింది స్పీకర్ కార్యాలయం. ఈటల రాజీనామా చేశారని, ఆ రాజీనామాను ఆమోదించామని కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం కూడా ఈ గంటన్నరలోనే అందజేశారు అసెంబ్లీ కార్యదర్శి.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఏడేళ్ల ల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తొలి టీఆరెస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అయ్యారు. టిఆర్ఎస్ పార్టీలో ఈటెల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఇది మూడో సారి. తెలంగాణ ఉద్యమంలో 2008 , 2010లో రెండు సార్లు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిచారు. తాజా రాజీనామాతో మూడోసారి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల.

ఈటల ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ స్థానం ఖాళీ అయినట్లు తెలంగాణ శాసనసభ విడుదల చేసిన గెజిట్ కింద చూడొచ్చు.