యాంకర్ రఘు కిడ్నాప్ కాదు అరెస్ట్ : చేసింది ఈ పోలీసులే, 14 రోజుల రిమాండ్

0
122

హైదరాబాద్ నగరంలో తొలి వెలుగు యాంకర్ రఘు కిడ్నాప్ అయినట్లు వార్తలొచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు రఘును నెంబర్ ప్లేట్ లేని జీపులో ఎత్తుకెళ్లారని ప్రచారమైంది.

అయితే ఈ ఘటనలో రఘును పోలీసులే అరెస్టు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. మీడియా వర్గాల నుంచి అందుతున్న వివరాలు ఏమంటే…

సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ పోలీసులు యాంకర్ రఘును గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. హుజూర్ నగర్ తీసుకుపోయి అక్కడ కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. రఘును జైలుకు తరలించే పనిలో ఉన్నారు పోలీసులు.

మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాలో 540 సర్వే నెంబరు గొడవకు సంబంధించిన భూములపై రఘు పెద్దఎత్తున టివిలో ప్రసారాలు చేశారు. ఆ సమయంలో బిజెపి నేతలు కూడా ఆ భూమి విషయంలో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా ఆ భూములను పరిశీలించారు. ఆ సమయంలోనే బిజెపి నేతల మీద కేసులు కూడా అయ్యాయి. అయితే తాజాగా రఘును ఈ భూముల కేసులోనే అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.