వెంకట్ బల్మూరిని అరెస్ట్ చేసిన పోలీసులు..

0
143

ఇటీవలే టెట్‌ వాయిదా వేయాలని ఎన్‌ఎస్‌యూ ఆందోళనకు దిగగా..తాజాగా ఐఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌‌ ను పోలీసులు అరెస్ట్ చేసారు. హుజూరాబాద్ నియోజకవర్గ జమ్మికుంట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లయ్య కుమారుడు సందీప్ గారు మృతి చెందిన విషయం తెలిసిందే.

అయితే బల్మూరి వెంకట్‌‌ సందీప్ గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాన్ని పరామర్శించడానికి నారాయణగూడ లోని ఇంటి నుండి జమ్మికుంటకు బయలుదేరాడు. ఈ క్రమంలో పోలీసులు ఎటువంటి  సమాచారం లేకుండా ఉప్పల్ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. నియోజకవర్గంలో ఓ నాయకుని కుమారుడు చనిపోతే వెళుతున్నానని చెప్పినా వినకుండా నారాయణగూడ పోలీస్ స్టేషన్ కి  తరలించారు.