ఆనందయ్య మందు కోసం ఈ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోండి

0
117

ఆనందయ్య మందు కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు, ఏపీ తెలంగాణలోనే కాదు పక్క రాష్ట్రాల వారు చాలా మంది ఇక్కడ మందు కోసం చూస్తున్నారు, అయితే ఈ మందు పంపిణీని మరింత ఈజీ చేసేలా ప్లాన్ చేశారు ఆనందయ్య.

ఇప్పటికే ఆనందయ్య ఓ విషయాన్ని చెప్పారు, ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దు అని తెలియచేశారు, మందు తయారు చేసిన వెంటనే ప్రతి జిల్లాకు 5 వేల చొప్పున మందులు పంపుతామని వెల్లడించారు. ఇక ఈ పిలుపుతో ఎవరూ కృష్ణపట్నం రావడం లేదు.

ఈ మందు కోసం క్యూ లు కట్టక్కర్లేదు… మందు కోసం వెబ్సైట్లో రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది. www.childeal.in పేరుతో వెబ్సైట్ రూపొందించారు..మందు కావాలి అనుకునేవారు సైట్లో ధరఖాస్తు చేసుకోవాలి.. ఇలా అప్లై చేసుకున్న వారికి కొరియర్ ద్వారా మందును వారి చిరునామాకు నేరుగా పంపిణీ చేస్తారు, దీని కోసం ఆనందయ్య టీమ్ వర్క్ చేస్తున్నారు.. కృష్ణపట్నం పోర్టులోని సెక్యూరిటీ అకాడమీ ప్రాంగణంలో ఈ ఔషదం తయారీకి ఏర్పాట్లు చేసుకున్నారు.