జ్యూస్ తో మందులు వేసుకున్నా -నేరుగా మాత్రలు మింగినా  ఎంత ప్రమాదమో తెలుసా?

0
113

ఈ ప్రపంచంలో పుర్రెకో బుద్ది.. ఎవరి ఆలోచన వారిది.. ఎవరికి వారు సొంత వైద్యులుగా ఫీల్ అవుతారు… ఏదైనా ఓ మందు పేరు చెబితే ఈ జబ్బుకి వాడేయచ్చని ఉచిత సలహా ఇస్తారు.  ఆ రోగికి అసలు జబ్బు ఏమిటి మరేమైనా సమస్యలు ఉన్నాయా ఇలాంటివి తెలుసుకోరు… ఇటీవల అయితే మందులు తీసుకునే సమయంలో కొందరు నేరుగా మింగేస్తున్నారు ఏదో చాక్లెట్ లా.. కాని ఇది చాలా డేంజర్ .. ఇంకొందరు పాలు కాఫీ టీ మజ్జిగ డ్రింకులు ఇలాంటి వాటితో తీసుకుంటున్నారు ఇది కూడా డేంజర్..

అయితే నేరుగా లేదా జ్యూస్ తో మందులు తీసుకుంటే చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు. జ్యూసులతో ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాబ్లెట్స్ వేసుకోకూడదని సలహా ఇస్తున్నారు..ఎందుకు అంటే ఇలా వేసుకుంటే 90 శాతం మందులు అస్సలు పనిచేయవు.

గుండె సంబంధ సమస్యలకు వాడే మందులని  జ్యూస్ తో వేసుకుంటే పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఇక పేగులు రక్తనాళాల సమస్యలకు కంతి సమస్యలకు , గర్భిణీ స్త్రీల మందులు ఇలాంటివి అస్సలు జ్యూస్ లో తీసుకోకూడదు.. మరికొందరు అయితే  నేరుగా మాత్రలు మింగుతారు, ఇలాంటి వారికి నాలికపై పుండ్లు వస్తాయి, అలాగే ఛాతీలో మంట, గుండె దడ, రక్త ప్రసరణ సమస్యలు ఛాతీనొప్పి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకే జాగ్రత్త ఇలాంటి పనులు చేయకండి.

మీకు మరో ఆర్టికల్లో తెలియచేశాo దీని గురించి చూడవచ్చు.

పాలు, టీ , కాఫీతో మాత్రలు వేసుకుంటే ఏమవుతుందో తెలుసా ?