కరోనా మూడో వేవ్ 98 రోజులేనట, మరణాలు 40వేల లోపే

0
114

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పటి వరకు ప్రపంచదేశాల్లో మొదటి, రెండో వేవ్ లు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. థర్డ్ వేవ్ కూడా రాబోతుందని సంకేతాలు అందుతున్నాయి. మూడో వేవ్ పై ఇప్పటికే అనేక పరిశోధనలు జరిగాయి. అనేక అంచనాలు ఉన్నాయి. అయినా తెలియని భయం మాత్రం జనాలను వణికిస్తున్నది. కరోనా 3వ వేవ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ ఎస్.బి.ఐ ఎకోవార్ప్ ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది.

కరోనా రెండో వేవ్ లాగే మూడో వేవ్ కూడా ఉధృతంగానే ఉండొచ్చని నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం రెండో వేవ్ 108 రోజుల పాటు కొనసాగే చాన్సెస్ ఉన్నాయని తెలిసిన అధ్యయనం మూడో వేవ్ మాత్రం 98 రోజుల్లోనే ముగిసిపోతుందని వివరించింది.

ప్రణాళికాబద్ధమైన సన్నద్ధత ద్వారా మూడో వేవ్ ను సునాయాసంగా కంట్రోల్ చేయగలరని వివరించింది. తద్వారా మరణాల సంఖ్య 40వేలకు మించకపోవచ్చని తేల్చింది. రెండో వేవ్ లో అయితే 17 లక్షల మరణాలు సంభవించాయి. ప్రతిరోజు 4వేల మరణాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ లో సీరియస్ కేసులు దాదాపు 20 శాతం నమోదయ్యాయి.

కోవిడ్ రెండో వేవ్ లో 1.69 కోట్ల మందికి వ్యాధి సోకింది. అయితే మూడో వేవ్ లో ఆ సంఖ్య 2 కోట్లకు చేరుకునే చాన్స్ ఉందని తెలిపింది. కానీ తీవ్ర ఇన్ఫెక్షన్ కలిగిన కేసులు భారీగా తగ్గిపోతాయని తేల్చింది. దీంతో మరణాలు తక్కువ సంఖ్యలో నమోదవుతాయని, మొత్తం కేసుల్లో 5శాతం మాత్రమే సంభవిస్తాయని వివరించింది.