ఘోర జల ప్రమాదం.. 145 మంది స్పాట్ డెడ్

-

145 people were dead after Republic of Congo boat accident: రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగిన ఘోర జల ప్రమాదంలో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. లులొంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తన్న ఓ పడవ బోల్తా పడింది. ఈ పడవ ప్రమాదంలో 145 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పడవ కాంగో వెళ్తుండగా బసన్కుసు పట్టణం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. సామర్థ్యానికి మించి ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కాంగో అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...