ఉన్నత విద్య కోసం కెనడా(Canada) వెళ్లిన 700 మంది భారత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంజాబ్ రాష్ట్రానికి విద్యార్థులకు జలంధర్‌కు చెందిన ఓ ఏజెంట్ ఫేక్ లెటర్స్ ఇచ్చాడు. విద్యార్థులు తీసుకెళ్లిన ఆఫర్ లెటర్లు అక్కడి విద్యాసంస్థలు నకిలీవిగా గుర్తించడంతో కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CBSA) బహిష్కరణ లేఖలు అందించింది. దీంతో వారిని తిరిగి భారత్ పంపేందుకు కెనడా(Canada) ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే కొందరు విద్యార్థులు భారత్ చేరుకున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చిన ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ బ్రిజేశ్ మిశ్రా పరారీలో ఉన్నాడు. అయితే తమకు న్యాయం చేయాలని టొరంటోలోని మిస్సిసాగాలో CBSA ఆఫీస్ ఎదుట బాధిత విద్యార్ధులు నిరసనకు దిగారు. అంతేకాకుండా కెనడా ఇమిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రాసెర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సానుకూలంగా స్పందించిన ఆయన న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.