గాల్లో ఎగురుతున్న విమానం నుంచి మంటలు

-

Flight Catches Fire |ఆకాశంలో ఎగురుతున్న విమానం నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అంతే విమానంలోని ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు మీద ఆశలతో ఏం జరగనుందోనని కంగారు పడుతున్న ప్రయాణికులను పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

- Advertisement -

Flight Catches Fire |అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 బోయింగ్‌ విమానం ఒహాయెలోని కొలంబస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫీనిక్స్‌ నగరానికి బయల్దేరింది. అయితే టేకాఫ్‌ అయిన 25నిమిషాలకే ఓ పక్షుల గుంపు విమానాన్ని ఢీ కొట్టింది. దీంతో విమానం నుంచి మంటలు వచ్చాయి. వెంటనే గమనించిన పైలట్ కొలంబస్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అనంతరం ప్రయాణికులను మరో విమానంలో అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత.. రోడ్డుపై జేసీ ప్రభాకర్ రెడ్డి భైఠాయింపు

Follow us on: Google News, Koo, Twitter

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...