కోవిడ్ బీభత్సం: వణికిస్తున్న ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్ తాజా సర్వే

-

As covid new wave rised in China Airfinity ltd survey has given a threatening report: చైనాలో ప్రస్తుత కోవిడ్ వేవ్(Corona Virus) విజృంభణ అక్కడి ప్రజలను వణికిస్తోంది. జనవరిలో లక్షల సంఖ్యలో కేసులు నమోదయ్యే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు నిపుణులు. లండన్‌కి చెందిన ఇన్ఫినిటీ లిమిటెడ్ పరిశోధనా సంస్థ తాజా శోధనను గమనిస్తే 140 కోట్ల జనాభా కలిగిన చైనా పరిస్థితి రాబోయే మూడు నెలల్లో ఘోరంగా మారనుందని తెలుస్తోంది. అతి త్వరలోనే చైనాలో రోజుకు పదిలక్షల కరోనా కేసులు, 5 వేల మరణాలు సంభవించే అవకాశముందని ఈ నివేదిక తెలిపింది. ఇది ప్రపంచం ఇంతవరకు ఎరగని అతిపెద్ద వైరస్ వ్యాప్తిగా నమోదవుతుందని అంచనా. ప్రస్తుత కోవిడ్ వేవ్ ఇలాగే కొనసాగితే 2023 జనవరి నెలలోనే రోజుకు 37 లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదముందని సూచించింది.

- Advertisement -

ఆరోగ్య విశ్లేషణల అంచనాపై దృష్టపెడుతున్న ఎయిర్‌ఫినిటీ సంస్థ కరోనా మహమ్మారి మొదలైనప్పటినుంచి దాని జాడను, గమనాన్ని పసిగడుతూనే ఉంది. గత మూడేళ్ల పరిశీలనా అనుభవం బట్టి చూస్తే 2023 మార్చి నెలలో చైనాలో రోజుకు 42 లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదముందని ఈ సంస్థ అంచనా వేసింది. డిసెంబర్ ప్రారంభం నుంచి చూస్తే ప్రస్తుతానికి చైనాలో రోజుకు 2,966 వైరస్ కేసులు అధికారికంగా నమోదువుతున్నాయి. రోజుకు పది కంటే తక్కువ కరోనా సంబంధ మరణాలు నమోదవుతున్నాయి. కానీ ఉన్నట్లుండి చైనాలో ఆసుపత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయని, స్మశానవాటికలకు శవాలు వెల్లువెత్తుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో అతిత్వరలో దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్షల్లోకి మారే అవకాశం లేకపోలేదని ఈ నివేదిక తెలిపింది.

Read Also: అర్జెంటీనా సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం.. కరెన్సీ నోట్లపై మెస్సీ ఫోటో?

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...