Brazil’s Football Player Pele Passes Away: బ్రెజిల్ ఫుట్ బాల్ దిగ్గజం పీలే (82) కన్నుమూశారు. గురువారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. పెద్ద పేగు క్యాన్సర్ తో ఈ లెజెండరీ ఫుట్ బాల్ ప్లేయర్ మరణించారు. పీలే కానరాని లోకాలకు వెళ్లారనే చేదు వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడుసార్లు ప్రపంచ కప్పు గెలిచిన జట్టులో సభ్యుడుగా ఉన్న ఒకే ఒక్క ప్లేయర్ గా పీలే రికార్డ్ సృష్టించారు.
1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే పోషించిన ముఖ్య పాత్ర ఫుట్ బాల్ ప్రపంచం ఎప్పటికీ మరవదు. తన అటాకింగ్ స్కిల్స్ తో ఫిఫా ప్రపంచాన్నే తనవైపుకి తిప్పుకున్నారు. తన డ్రిబ్లింగ్ ట్యాలెంట్ తో ప్రత్యర్థుల్ని బోల్తా కొట్టించడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్యలాంటిది. గోల్ పోస్టునే టార్గెట్ చేస్తూ ముప్పుతిప్పలు పెట్టేవారు. ఫిఫా వరల్డ్ కప్ మ్యాచుల్లో పీలే(Football Player Pele) మొత్తం 12 గోల్స్ చేశారు.