china crossed 10000 Corona Cases on today: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటికి కనిపించని ఈ వైరస్ ప్రపంచంలోని ప్రజల ఆరోగ్యాలనే కాదు ఆర్థిక వ్యవస్థలను కూడా నాశనం చేసింది. తగ్గుతుందని అనుకున్న కొవిడ్ మళ్లి విజృంభిస్తుంది. చైనా దేశంలో ఒక్కరోజే 10,729 కొత్త (Corona Cases)కేసులు వచ్చాయి. దీంతో చైనా ప్రభుత్వం జగ్రత్త పడుతుంది. కరోనా వచ్చిన వారిలో చాల మందికి లక్షణాలు కనిపించడం లేదని అక్కడి వైద్యులు చెబుతున్నారు. చైనాలోని గ్వాంగ్‌జౌ, చాంగ్‌కింగ్ నగరాల్లో 50 లక్షలకి లాక్‌డౌన్ విధించింది. చైనా ప్రభుత్వం వైరస్ నివారణ కోసం జీరో కొవిడ్ వ్యూహాన్ని కూడా అమలు చేస్తున్నకేసులు అదుపులోకి రావడం లేదు. దీంతో కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరగడంతో రాజధాని బీజింగ్‌లోని పార్కులను మూసివేశారు. దేశవ్యాప్తంగా మరోసారి కఠిన ఆంక్షలను విధిస్తున్నారు. కాగా.. ఇండియాలో గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు ఓమిక్రాన్ సబ్-వేరియంట్ BF-7 మొదటి కేసును గుర్తించిన విషయం తెలిసిందే.