Earthquake in Bangkok | శుక్రవారం మధ్యాహ్నం థాయిలాండ్, దానికి పొరుగున ఉన్న మయన్మార్ లను 7.7 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. భూకంపం కారణంగా బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న ఒక ఎత్తైన భవనం పేకమేడలా కూలిపోయింది. ఇంకా ప్రాణనష్టం గురించిన వివరాలు తెలియలేదు. బ్యాంకాక్‌లోని ప్రసిద్ధ చతుచక్ మార్కెట్ సమీపంలో ఈ భవనం కూలిపోయింది. అయితే కూలిపోయిన సమయంలో ఎంతమంది కార్మికులు లోపల ఉన్నారనే దానిపై సమాచారం లేదని పోలీసులు తెలిపారు.
Earthquake in Bangkok | మధ్యాహ్నం మరోసారి 6.4 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. ఈ క్రమంలో అధికారులు ప్రజలను ఇళ్ల నుండి ఖాళీ చేయించారు. మరలా భూకంపం రావచ్చనే సందేహంతో ముందస్తు చర్యగా ప్రజలను ఇళ్ల బయటే ఉండాలని హెచ్చరించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం… భూకంపం 10 కిలోమీటర్లు (6.2 మైళ్ళు) లోతు తక్కువగా ఉందని, మయన్మార్ లో కేంద్రీకృతమై ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే, జర్మనీకి చెందిన జిఎఫ్‌జెడ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపాయి. భూకంపం కారణంగా బ్యాంకాక్ లోని ఎత్తైన పైకప్పు కొలనుల నుండి నీరు పక్కకు ఒలికి దూసుకుపోయింది. అలాగే అనేక భవనాల నుండి శిథిలాలు పడిపోయాయి.