Floods in California USA: అమెరికాను నేచురల్ డిజాస్టర్స్ వణికిస్తున్నాయి. కాలిఫోర్నియాలో భారీగా వరదలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి సాలినస్ నది ఉప్పొంగి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా అనేక మంది నిరాశ్రయులు అయ్యారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. వేర్వేరు ఘటనలో 19 మంది మరణించినట్లు నిర్ధారించారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 24వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లాస్ ఏంజిల్స్ నగరంలోనూ వరదలు బీభత్సం సృష్టించాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 34 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటినట్లు స్థానిక అధికారులు అంచనా వేశారు. దక్షిణ అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. మెస్సిసిపి నుంచి జార్జియా వరకు విస్తరించిన ఈ బలమైన గాలుల ధాటికి 9 మంది మరనించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అంతేకాకుండా అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. టోర్నడోల ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. అలాబామాలో పలువురు గల్లంతయ్యారని అచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.