Fuel tanker explosion kills 10 in South Africa: దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బోక్స్ బర్గ్ లో గ్యాస్ ట్యాంకర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పదిమంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 40 మందికి గాయాలయ్యాయి. గ్యాస్ ట్యాంకర్ రైల్వే బ్రిడ్జి క్రింది గా ప్రయాణిస్తుండగా.. బ్రిడ్జ్ కింద ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో ఒత్తిడి పెరిగి గ్యాస్ ట్యాంకర్ ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడు ఘటనలో బ్రిడ్జితో సహా పక్కనే ఉన్న ఆసుపత్రి, రెండు ఇల్లు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చి, గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.
Fuel Tanker Explosion: ఘోర ప్రమాదం.. 10 మంది మృతి, 40 మందికి గాయాలు
-