నేపాల్ ప్రధాని ప్రచండ(Prachanda) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ప్రధానిగా చేసేందుకు భారత్‌కు చెందిన ఓ వ్యాపారి తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు ప్రధాని ప్రచండ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం ప్రధాని రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. నేపాల్‌లో ఉన్న వ్యాపారవేత్త సర్దార్ ప్రీతమ్ సింగ్.. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నించినట్లు ప్రచండ తెలిపారు. ఓ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి అనేకసార్లు వెళ్లారని, ఆ తర్వాత కాఠ్మాండులో కూడా అనేక మీటింగ్‌లు పెట్టారని ప్రపంచ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై నేపాల్‌లో విమర్శలు వస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష కమ్యూనిస్టు పార్టీ బుధవారం జాతీయ అసెంబ్లీ సమావేశాలను అడ్డుకున్నది. ప్రధాని ప్రచండ(Prachanda) రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
Read Also:
1. ధరణి కి ధీటుగా భూమి డిక్లరేషన్ విడుదల చేసిన టీపీసీసీ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat