అమెరికా దేశంలోని అత్యున్నత ఆరోగ్య పరిశోధన, నిధుల సంస్థ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) డైరెక్టర్‌గా భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త జే భట్టాచార్యను(Jay Bhattacharya) US సెనేట్ ధృవీకరించింది. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో హెల్త్ పాలసీ ప్రొఫెసర్ అయిన భట్టాచార్య మంగళవారం 53-47 ఓట్లతో ఎన్నికయ్యారని US సెనేట్ అధికారిక వెబ్‌సైట్ తెలిపింది. NIH ప్రెసిడెంట్ అయిన US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది నవంబర్ లో భట్టాచార్యను 18వ NIH డైరెక్టర్‌గా నామినేట్ చేశారు.
NIH డైరెక్టర్ గా భట్టాచార్య(Jay Bhattacharya) ఎన్నికవడంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. “డాక్టర్ భట్టాచార్య రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్‌తో కలిసి నేషన్స్ మెడికల్ రీసెర్చ్‌కు దర్శకత్వం వహించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, ప్రాణాలను కాపాడే ముఖ్యమైన ఆవిష్కరణలను చేయడానికి పని చేస్తారు” అని ట్రంప్ వెల్లడించారు. NIH డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భంగా భట్టాచార్య మీడియాతో మాట్లాడుతూ… సైన్స్, ప్రజారోగ్యం రాజకీయం అయ్యాయని తాను అర్థం చేసుకున్నానని అన్నారు. చాలామంది ఆరోగ్య అధికారులను, నిపుణులను నమ్మడం లేదని అన్నారు.
NIH విశ్వసనీయమైన, ఉపయోగకరమైన పరిశోధనలకు మద్దతు ఇవ్వాలని భట్టాచార్య అన్నారు. అధ్యక్షుడు ట్రంప్, కార్యదర్శి కెన్నెడీ ల మేకింగ్ అమెరికా హెల్తీ ఎజెండాను అమలు చేస్తాను అని అన్నారు. గోల్డ్ స్టాండర్డ్ సైన్స్, ఆవిష్కరణలతో దేశంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య అవసరాలను తీర్చడానికి NIHకి కట్టుబడి ఉంటాను అని ఆయన అన్నారు.