Joe biden Ukraine visit: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలాండ్ పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఆకస్మిక పర్యటన చేపట్టారు బైడెన్. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో భేటీ అయ్యారు. కాగా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత బైడెన్ ఉక్రెయిన్ లో పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి మరో నాలుగు రోజుల్లో ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో బైడెన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ కు అమెరికా అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే.
ఉక్రెయిన్ లో అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఆకస్మిక పర్యటన
-