అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) డైరెక్టర్ గా కాష్ పటేల్(Kash Patel) నియమితులయ్యారు. ఆయనకు ట్రంప్ తొమ్మిదవ FBI డైరెక్టర్ గా నియామక పత్రాన్ని అందించి బాధ్యతలు అప్పగించారు. ట్రంప్(Trump) అధ్యక్ష స్వీకరించడానికి ముందే ఎఫ్బీఐ డైరెక్టర్ గా కాష్ పటేల్ పేరును ప్రకటించారు. ఇలాంటి పదవులకు సెనేట్ ఆమోదం తప్పనిసరి. ఈ నేపథ్యంలో సెనేట్ లో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా 51 – 49 ఓట్లతో విజయం సాధించారు కాష్ పటేల్. రిపబ్లికన్ పార్టీ(Republican Party)కి మెజారిటీ ఉన్నప్పటికీ ఓటింగ్ లో ఇద్దరు పార్టీ విప్ ధిక్కరించి కాష్ పటేల్ కి వ్యతిరేకంగా ఓటు వేశారు. రెండు ఓట్ల తేడాతో ఆయన నియమానికి సెనేట్ లో ఆమోదముద్ర పడింది. ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవిని చేపట్టిన తొలి హిందూ, భారతీయ అమెరికన్ కాష్ పటేల్ కావడం గమనార్హం. ట్రంప్ విధేయుడిగా కాష్ పటేల్ కు పేరు ఉంది.
కాష్ పటేల్(Kash Patel) ఏమన్నారంటే
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తొమ్మిదవ డైరెక్టర్‌గా నియమితులైనందుకు నాకు గౌరవం ఉంది. అధ్యక్షుడు ట్రంప్, అటార్నీ జనరల్ బోండిలకు ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీగా, న్యాయం పట్ల FBI కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రతిఒక్కరు గర్వించదగ్గ విధంగా FBI పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. అమెరికన్ లకు హాని కలిగించడానికి ఎవరు ప్రయత్నించినా.. వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా విడిచిపెట్టబోమని హెచ్చరించారు. డైరెక్టర్ గా నా లక్ష్యం పై స్పష్టత ఉందని చెప్పారు.