రష్యాకు చెందిన లూనా-25 కుప్పకూలిన ప్రాంతాన్ని గుర్తించిన నాసా

-

జాబిల్లి రహస్యాలు తెలుసుకునేందుకు భారత్.. చంద్రయాన్-3 ప్రయోస్తుందని తెలియగానే.. రష్యా కూడా లూనా-25(Luna-25) ని ప్రయోగించింది. అంతేగాక చంద్రుడికంటే ముందుగానే అది చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యేలా ప్లాన్ కూడా చేసింది. కానీ అది కాస్త విఫలమై ల్యాండింగ్‌కి రెండురోజుల ముందే లూనా-25 కుప్పకూలింది. అయితే తాజాగా మూన్ సౌత్ పోల్ పైకి రష్యా ప్రయోగించిన లూనా-25 కుప్పకూలిన ప్రదేశాన్ని నాసా గుర్తించి దాని ఫొటోల్ని విడుదల చేసింది. నాసా విడుదల చేసిన రెండు ఫొటోల్లో లూనా 25 కుప్పకూలిన ప్లేస్ లో అక్కడక్కడా గుంతలు పడినట్లు తెలుస్తోంది.

- Advertisement -

నాసా కు చెందిన లూనార్‌ రికనైసెన్స్ ఆర్బిటర్ స్పేస్‌ క్రాఫ్ట్‌ ఈ ఫోటోలను తీసింది. ఈ క్రేటర్ సుమారు 10 మీటర్ల వెడల్పు ఉంది. ఇది లూనా-25 ల్యాండ్‌ అవడానికి ప్లాన్ చేసిన ప్లేస్ కి దగ్గరగా ఉండడంతో..లూనా-25(Luna-25) కూలడం వల్లే ఇది ఏర్పడి ఉండొచ్చని నాసా అభిప్రాయపడుతోంది. అయితే లూనా 25 ప్రాజెక్టు ఫెయిల్ కావడంతో రష్యా దీనిపై ఇన్వెస్టిగేట్ చేసేందుకు ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

కాగా గత నెల 11న రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ నుంచి ప్రయోగించిన లూనా-25 కూలిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా చంద్రుడి ఫొటోలను పంపించింది. మరోవైపు భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌-3 విజయవంతంగా సాఫ్ట్‌ల్యాండింగ్‌ చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు సూర్యుడిని టార్గెట్ చేస్తూ.. సెప్టెంబర్ 2న ఆదిత్య-ఎల్ 1ని కూడా లాంఛ్ చేయబోతోంది. ఇందుకు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది.

Read Also: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...