తొమ్మిదేళ్ల తర్వాత భారత్‌కు పాక్ నాయకుడు.. ఆసక్తికరంగా మారిన పర్యటన

-

Pakistan Foreign Minister |2019 ఫిబ్రవరిలో పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిన నాటినుంచి పాకిస్తాన్, భారత్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ క్రమంలో ఇరు దేశాల సరిహద్దుల్లో కొంతకాలం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేగాక, ఆ దాడి అనంతరం ఇప్పటివరకు పాకిస్తాన్ నాయకులు ఇండియాలో, భారత నేతలు పాకిస్తాన్‌లో పర్యటించలేదు. అయితే.. అనూహ్యంగా తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్ కు చెందిన నాయకుడు ఒకరు భారత్‌కు రానున్నారు.

- Advertisement -

మే 4, 5 తేదీల్లో గోవాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ-ఎస్ సీఓ విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి(Pakistan Foreign Minister) బిలావల్ భుట్టో జర్దారీ హాజరుకానున్నారు. ఈ సదస్సుకు హాజరుకావాలని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. బిలావల్ భుట్టో జర్దారీని ఆహ్వానించారని పాక్ అధికారులు తెలిపారు. కాగా, 2014లో నవాజ్ షరీఫ్ పర్యటన తర్వాత ఆ దేశ నాయకులు భారత్‌కు రావడం ఇదే తొలిసారి అవుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జర్దారీ పర్యటన ఆసక్తిగా మారింది.

Read Also: ఆర్మీ వాహనంలో చెలరేగిన మంటలు.. నలుగురు జవాన్ల సజీవ దహనం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...