భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా గురువారం ప్యారిస్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీకి ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. మోడీకి వెల్కమ్ చెప్పేందుకు పెద్దఎత్తున ప్రవాస భారతీయులు ఎయిర్ పోర్టు వద్దకు చేరుకున్నారు. ప్రధాని మోడీ వారందరికీ అభివాదం చేశారు. అనంతరం తాను ఫ్రాన్స్‌కు చేరుకున్నట్లుగా ట్వీట్ చేసిన మోడీ.. స్వాగత కార్యక్రమ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఈ పర్యటనలో భాగంగా భారత్- ఫ్రాన్స్‌ల పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించేలా కృషి చేస్తానన్నారు. తొలుత ప్రధాని మోడీ(PM Modi).. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఫ్రాన్స్ సెనేట్‌ను సందర్శించి.. సెనేట్ అధ్యక్షుడు గెరాడ్ లార్చర్‌తో భేటీ అయ్యారు. తదుపరిగా మోడీ ప్రోగ్రామ్స్ లిస్టులో ప్రవాస భారతీయులతో మీటింగ్, ఎలీసీ ప్యాలెస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ ఏర్పాటు చేసిన ప్రైవేట్ విందుకు హాజరవడం కూడా ఉన్నాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో శుక్రవారం జరగనున్న నేషనల్ డే పరేడ్‌లో మోడీ పాల్గొననున్నారు. ఇందులో భారత త్రివిధ దళాలు, ఫ్రెంచ్ సైన్యంతో కలిసి పరేడ్ లో పాల్గొనడంతో పాటు విన్యాసాలు చేస్తాయి.
Read Also: రాజీనామా చేస్తా.. బీఆర్ఎస్ సర్కార్‌కు MP కోమటిరెడ్డి సవాల్
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat