టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోరవ్(Telegram CEO Pavel Durov)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పారిస్‌లోని బోర్గెడ్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాప్‌కు సంబంధించిన కేసులోనే అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. టెలిగ్రామ్‌లో మోడరేటర్లు లేరన్న విషయంపై ఫ్రెంచ్ పోలీసులు తమ దర్యాప్తును ఫోకస్ చేశారు. మోడరేటర్లు లేకపోవడంతో యాప్‌లో నేర కార్యకలాపాలు విచ్చలవిడిగా కొనసాగే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. దురోవ్.. అజర్ బైజాన్ నుంచి ప్రైవేట్ జెట్‌లో ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని విమానాశ్రయం నుంచే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం చుట్టూ నెలకొన్న రాజకీయాలకు టెలిగ్రామ్ కేంద్రంగా మారింది. అంతేకాకుండా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అతని అధికారులకు టెలిగ్రామ్ కీలక కమ్యూనికేషన్ మాద్యమంగా పనిచేసిందన్న వాదన కూడా జోరుగా సాగుతోంది. ఈ యుద్ధానికి సంబంధించిన వార్తలను షేర్ చేసుకోవడానికి ఉక్రెయిర్(Ukraine), రష్యా(Russia) ప్రభుత్వాలు కూడా టెలిగ్రామ్‌నే వినియోగించాయన్న వాదన కూడా ఉంది. అయితే టెలిగ్రామ్‌లో నేరాలు పెరుగుతున్నాయన్న అంశంపై దర్యాప్తులో భాగంగా పోలీసులు సీఈఓ(Telegram CEO)ను అరెస్ట్ చేశారు. దీనిపై ఇప్పటి వరకు టెలిగ్రామ్ సంస్థ కానీ, పోలీసులు కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.