ప్రపంచంలో ఎక్కువగా అక్రమ రవాణా అవుతున్న జంతువుల్లో పాంగోలిన్(Pangolin) ఒకటి. ఇది చూడటానికి భయంకంరంగా ఉన్నా మనుషులను ఏమి చేయదు. క్షీరద(Mammal) జాతికి చెందిన పాంగోలిన్ కేవలం చీమలు, చెద పురుగులు తిని జీవిస్తోంది. అలాంటి జంతువు చర్మం, మాంసానికి చైనా, వియత్నాం దేశాల్లో మాంఛి డిమాండ్ ఉంది. మన ఇండియాలో దీనిని అలుగు, సల్లూ పాము అనే పేర్లతో పిలుస్తారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్(IUCN) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల అక్రమ రవాణాలో 20శాతం పాంగోలిన్‌లే ఉండడం గమనార్హం. చైనా దేశంలో సాంద్రదాయ మందుల తయారీలో పాంగోలిన్ శరీరంపై ఉన్న పొలుసులను ఉపయోగిస్తారు.
మరోవైపు పాంగోలిన్(Pangolin)ల వేటను అనేక దేశాలు నిషేధించడంతో వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. అందుకే అంతర్జాతీయ మార్కెట్‌లో స్మగ్లర్లు పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తున్నారు. దీంతో ఒక్కో పాంగోలిన్ ధర రూ.10 నుంచి రూ.15లక్షల వరకు ఉంటుందట. అలాగే మాంసం ధర కూడా వేలల్లో పలుకుతోంది. ఉబ్బసం, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు మందులను తయారు చేయడంతో పాటు సెక్స్ కోరికలు పెరిగే డ్రగ్స్ తయారీలోనూ దీని చర్మం, ఎముకలు ఉపయోగిస్తున్నారు.
Read Also: భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించబోయే ఉద్యోగాలు ఏంటంటే?
Follow us on: Google News, Koo, Twitter