బంగ్లాదేశ్(Bangladesh)లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలకు తెరపడేలా కనిపించడం లేదు. హిందువులే టార్గెట్‌గా బంగ్లాదేశ్ ముస్లింలు రెచ్చిపోతున్నారు. ఆ దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న మమ్మద్ యూనస్ ప్రభుత్వం.. మైనారిటీలు, హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు.
ఇటీవల ఇస్కాన్ ప్రముఖ నాయకుడు చిన్మోయ్ కృష్ణదాస్(Chinmoy Krishna Das)ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై బంగ్లా పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసి మరీ ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనకు బెయిల్ ఇవ్వడానికి కూడా అక్కడి కోర్టు నిరాకరించింది. ఆ తర్వాత ఇటీవలే హిందూ సన్యాసి శ్యామ్ దాస్ ప్రభు(Shyam Das Prabhu)ని కూడా అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా కృష్ణదాస్ శిష్యులు మరో ఇద్దరు ఒకే రోజు అదృశ్యమయ్యారు. ఈ విషయాన్ని ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారమన్ దాస్(Radharamn Das) వెల్లడించారు. ఈ మేరకు నలుగురు హిందూ పూజారుల ఫొటోలను షేర్ చేశారాయన. వాటితో పాటుగా ‘వీళ్లు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా? వారందరినీ బంగ్లాదేశ్(Bangladesh) పోలీసులు అకారణంగా అరెస్ట్ చేశారు’’ అని రాసుకొచ్చారాయన.
‘‘చిన్మోయ్ తర్వాత మరో ఇద్దరు హిందూ సన్యాసులు రంగనాథ్ శ్యాంసుందర్ దాస్ బ్రహ్మచారి(Ranganath Shyamsunder Das), రుద్రపతి కేశవ్ దాస్ బ్రహ్మచారిలను(Rudrapati Keshav Das) బంగ్లాదేశ్ పోలీసులు పుండరిక్ ధామ్ నుంచి అరెస్ట్ చేశారు’’ అని రాధారమన్ తన పోస్ట్‌లె వెల్లడించారు. ఆహారం అందించడానికి వెళ్లిన సమయంలో చిన్మోయ్‌ని అరెస్ట్ చేశారని కూడా ఆయన తెలిపారు.