ఆస్ట్రేలియాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

-

ఆస్ట్రేలియా(Australia)లో ఏపీ కి చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఈతకి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లాకు చెందిన చైతన్య ముప్పరాజు, ప్రకాశం జిల్లాకు చెందిన సూర్యతేజ బొబ్బ పై చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. మంగళవారం వీరిద్దరూ మరో స్నేహితుడితో కలిసి క్వీన్స్‌లాండ్‌లోని కెయిర్న్స్ సమీపంలోని మిల్లా మిల్లా జలపాతంలో ఈతకు వెళ్లారు. ఈత కొడుతున్న సమయంలో చైతన్య, సూర్యతేజ నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… మంగళవారం చైతన్య, సూర్యతేజ మరో స్నేహితుడితో కలిసి మిల్లా మిల్లా జలపాతానికి వెళ్లారు. సరదాగా ఈతకొట్టేందుకు జలపాతం వద్దకి వెళ్లారు. ఈత కొడుతున్న సమయంలో ఒకరు నీటిలో కొట్టుకుపోవడం గమనించిన మరో స్నేహితుడు అతనిని కాపాడేందుకు వెళ్ళాడు. ఘటనలో దురదృష్టవశాత్తూ చైతన్య, సూర్యతేజ ఇద్దరూ నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు అని ఇన్‌స్పెక్టర్ జాసన్ స్మిత్ వెల్లడించారు.

Australia | విద్యార్థులు నీటమునిగినట్లు సమాచారం అందుకున్న వెంటనే క్వీన్స్‌లాండ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం 8:50 గంటలకు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఒక హెలికాఫ్టర్ సహాయంతో వారికోసం గాలింపుచర్యలు చేపట్టారు. విద్యార్థులు కనిపిస్తే వైద్య సహాయం అందించేందుకు అంబులెన్స్, వైద్య సిబ్బంది ఉన్నారు. కానీ ఎంత వెతికినా వారి ఆచూకీ లభించలేదు. అయితే ఆ ఇద్దరితోపాటు మరో స్నేహితుడు కూడా ఉన్నాడు. కానీ స్నేహితుల మరణంతో అతను షాక్ లో ఉన్నాడని అని ఇన్‌స్పెక్టర్ జాసన్ తెలిపారు. కాగా, పోలీసులు మూడవ స్నేహితుడి వివరాలు వెల్లడించలేదు. చైతన్య, సూర్యతేజ మరణంతో ఇండియాలోని వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read Also: ‘సిస్టమ్ లాగౌట్ చేసేయండి’.. అధికారులకు ప్రధాని సూచన
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

White Hair | తెల్ల జుట్టుకు తేలికైన చిట్కాలు..

తెల్ల జుట్టు(White Hair) అనేది ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న...

Baby John | అదరగొడుతున్న ‘బేబీ జాన్’ ట్రైలర్..

మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh).. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘బేబీ...