తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ : బీమా పథకం ఏడాది పొడిగింపు

0
32

రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రైతు బీమా పథకం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ఈ పథకం మరో ఏడాది కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఆగస్టు 13వ తేదీ వరకు రైతు బీమా పథకం కొనసాగనున్నట్లు 2019, ఆగస్టు 07వ తేదీ బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 31 లక్షల మంది రైతులు రైతు బీమా ద్వారా లబ్ది పొందనున్నారు. ఒక్కో రైతుకు రూ.3వేల ప్రీమియంతో రూ. 5 లక్షల బీమా కల్పించనుంది ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. ఇటీవలే ఎన్నికల్లో కేసీఆర్ రైతులకు పలు హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. అందు ప్రధానమైంది రైతు బీమా పథకం. రైతు చనిపోతే కుటుంబం రోడ్డున పడొద్దన్న ఉద్దేశ్యంతో రైతు బీమా పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపు వయస్సున్న వారందరూ దీనికి అర్హులు.

2018 ఆగస్టు 14వ తేదీ నుంచి 2019 ఆగస్టు 13 వరకు జీవిత బీమా వర్తించనుందని అప్పుడు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే..నామినీకి 10 రోజుల్లోగా 5 లక్షల బీమా పరిహారం LIC నుంచి అందుతుంది. ప్రీమియంతో పాటు GST, స్టాంప్ డ్యూటీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.