ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది

ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది

0
31

తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు నటుల కంటే ఇతర భాషల వారికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు మన దర్శక నిర్మాతలు. ఈ విషయాన్ని వారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా సభ్యులు నిర్మాతలు, దర్శకులు, రచయితల దృష్టికి తీసుకెళ్లారు. దయచేసి మా సభ్యులకు అవకాశాలు కల్పించాలని వారు కోరారు.ఈ సందర్భాంగా వారు టిఎఫ్ ఐ కలెక్టివ్ కమిటీ చైపర్సన్ వై సుప్రియా, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్, డైరెక్టర్స్ అశోసినేషన్ అధ్యక్షుడు ఎం శంకర్, రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పరుచూరి గోపాల కృష్ణను కలిశారు. మనం, హిందీ, మలయాళం, తమిళం నుంచి ఆర్టిస్టులను తీసుకొస్తాం కానీ తెలుగు ఇండస్ట్రీ కళాకారులకు మాత్రం ఆ మూడు రాష్ట్ర వారు వేషాలు ఇవ్వరు.

మనం వారిని తీసుకొచ్సి యాక్టింగ్ నేర్పించి, స్టార్ హోటల్ ఇచ్చి డబ్బులిచ్చి ఫేమ్ కూడా ఇస్తున్నాం, వాళ్ళకి గుర్తింపు ఉంటుంది కానీ తెలుగు ఇండస్ట్రీకి గుర్తింపు ఉండడం లేదని అలీ అన్నారు. కొంతమంది కాళాకారులు మా వద్దకు వచ్చేసి అవకాశాలు లేక పూటా గడవక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఏడ్చేస్తున్నారు. అలంటి పరిస్థితి ఇక్కడ ఉంది. నిర్మాతలు, దర్శకులు, కో, డైరెక్టర్లు, మన వాళ్లకు మననం సహాయం చేసి వారికి అవకాశాలు కలిపించాలని హీరో రాజశేఖర్ అన్నారు.