వాల్మీకి మూవీ రివ్యూ..

వాల్మీకి మూవీ రివ్యూ..

0
79

టైటిల్ : గద్దలకొండ గణేష్
బ్యానర్ : 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌
తారాగణం : వరుణ్ తేజ్, పూజ హెగ్డే, అధర్వ మురళి, మృణాళిని రవి తదితరులు..
సంగీతం : మిక్కీ జె మేయర్
ఎడిటర్ : చోట కె ప్రసాద్
దర్శకత్వం : హరీష్ శంకర్
నిర్మాత : రామ్‌ ఆచంట, గోపీ ఆచంట
విడుదల తేదీ : 09-20-2019

తొలిప్రేమ, F3 సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం గద్దలకొండ గణేష్.. పూజ హెగ్డే కథానాయిక.. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలుండగా అనుకున్నట్లే ఈ సినిమా కి భారీ బజ్ క్రియేట్ అయ్యింది.. మరి ఈరోజే రిలీజ్ అయినా ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందొ తెలుసుకుందామా..

కథ విషయానికొస్తే,

అభి (అధర్వ) అసిస్టెంట్ డైరెక్టర్. తనకు ఎదురైన చేదు అనుభవం వల్ల డైరెక్టర్‌గా మారాలనుకొంటాడు. కథాన్వేషణలో గద్దల కొండ గణేష్ (వరుణ్ తేజ్) అనే ఫ్యాక్షనిస్టు జీవితం తారసపడుతుంది. తన సినిమాకు సరైన కథ అనుకొంటాడు. గద్దల కొండకు వెళ్లి గణేష్ గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో గణేష్ ఫ్యాక్షన్ వ్యవహారాలు, హత్యలు, దొమ్మిలు ప్రత్యక్షం చూస్తాడు. ఈ నేపథ్యంలో నేరుగా గణేష్‌కు అభి దొరికిపోతాడు. తన జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నం తెలుసుకొని ఏకంగా ఆ సినిమాకు హీరోగా మారిపోతాడు.

నటీనటులు,

గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ చాలా బాగా నటించాడు. తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. కొన్ని కొన్ని చోట్ల నెగటివ్ షేడ్స్ వరుణ్ కి అంతగా సెట్ అవ్వకపోయినా ఒక నటుడిగా తన ప్రతిభను చాటే సినిమా ఇది. అథర్వ మురళి కూడా చాలా బాగా నటించాడు. తమిళ హీరో అయినా తెలుగు నేటివిటీ కి తగ్గట్లు గా మంచి హావభావాలు కనపరిచాడు.. వరుణ్ తేజ్ కి ధీటుగా తన పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. పూజ హెగ్డే ఈ సినిమాలో చాలా అందంగా కనిపించడం మాత్రమే కాక తన నటనతో కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. అయితే పూజ హెగ్డే పాత్ర కేవలం ఫ్లాష్ బ్యాక్ కే పరిమితమవ్వడం కొంత నిరాశ పరుస్తుంది. మృణాళిని రవి కూడా పూజ తో పోటీ పడుతూ తన వంతు నటనతో మంచి మార్కులు వేయించుకుంది.

సాంకేతిక నిపుణులు :

గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజ్ లో హిట్ అందుకొని దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్టర్ గా మరోసారి తన మాస్ ఎలిమెంట్స్ ని కరెక్ట్ గా ప్రజెంట్ చేశాడు. ప్రతి సీన్ లో తన మార్క్ మేకింగ్ ని చూపించాడు. బోర్ కొట్టిస్తుంది అనేలేపే డైలాగ్స్ అలాగే పంచ్ లతో మంచి ఎనర్జీని తెప్పించాడు. వరుణ్ బాడీ లాంగ్వేజ్ ని దర్శకుడు చాలా బాగా వాడుకున్నాడు అనిపిస్తోంది. డైలాగ్స్ డెలివరీ అలాగే నెగిటివ్ షేడ్స్ ని సరికొత్తగా ప్రజెంట్ చేశాడు. మరో హీరో అథర్వ కూడా తన మార్క్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి మంచి బూస్ట్ ని అందించాయి. ఫస్ట్ హాఫ్ అలా అలా సాగినా సెకండ్ హాఫ్ డిఫరెంట్ ఎపిసోడ్స్ సినిమకు ఉపయోగపడ్డాయి. పెద్దగా అంచనాలు లేకుండా వెళితే మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ని చూసిన అనుభూతి కలుగుతుందని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్ :

వరుణ్ తేజ్ గెటప్

హరీష్ శంకర్ డైరెక్షన్

మిక్కీ మీ జేయర్

మైనస్ పాయింట్స్ :

కామెడీ లేకపోవడం

సాగతీత

ఓవరాల్ గా :

ఓవరాల్ గా సినిమా చాల బాగుంది.. గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ సూపర్ హిట్ అందుకున్నాడు.. ఫ్లాష్ బ్యాగ్ లో వరుణ్ తేజ్ మరియు పూజ హెగ్డే ప్రేమ కథని చాలా బాగా తెరకెక్కించారు. వారి మధుర సన్నివేశాలు చాలా బాగుంటాయి. అప్పటిదాకా కథని చాలా కొత్తగా చూపించినప్పటికి క్లైమాక్స్ లో రొటీన్ గా మార్చేయడం కొంత నిరాశకు గురిచేస్తుంది. చివరగా ‘గద్దలకొండ గణేష్’ సినిమా ఒక మాస్ మసాలా మూవీ.

రేటింగ్ : 2.5 /5