ఒరేయ్ బుజ్జిగా రివ్యూ

0
195

నటీనటులు : రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి తదితరులు

దర్శకత్వం : కొండా విజయ్‌కుమార్‌

నిర్మాత : కె.కె.రాధా మోహ‌న్

మ్యూజిక్ : అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ : ఆండ్రూ

కథ :

బుజ్జి రాజ్‌ తరుణ్ ని తన తండ్రి కోటేశ్వరరావు పోసాని పెళ్లి చేసుకోమని బలవంతపెట్టడంతో చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోతాడు బుజ్జి. అదే సమయంలో అదే ఊరి నుండి పెళ్లి కూతురు కృష్ణవేణి మాళవిక నాయర్ తన బావతో పెళ్లి ఇష్టం లేక పారిపోతుంది. దాంతో వీరిద్దరూ లేచిపోయారనే పుకారు ఆ ఊరంతా పాకి ఇరు కుటుంబాల మధ్య గొడవలకు దారితీస్తోంది. మరోపక్క ఇంటి నుండి పారిపోయే సమయంలో బుజ్జి – కృష్ణవేణి అనుకోకుండా ట్రైన్ లో కలుసుకోవడం.. ఇద్దరూ తమ మారు పేర్లతో పరిచయం అవుతారు. ఆ మారు పేర్లు అయినశ్రీను – స్వాతిగానే వాళ్ళు ప్రేమలో పడతారు. చివరకు వీరికి ఒకరికి ఒకరు ఎవరనేది ఎలా తెలుస్తోంది.అంతలో సృజన (హెబ్బా పటేల్)తో బుజ్జిగాడి సిల్లీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఏమిటి ? ఈ మధ్యలో కృష్ణవేణికి బుజ్జికి వచ్చిన సమస్యలు ఏమిటి ? వీరిద్దరూ ఆడిన చిన్న అబద్దాలు కారణంగా వీరి జీవితాల్లో ఎలాంటి డ్రామా నడిచింది ? అంతిమంగా వీరు ఎలా ఒకటి అయ్యారు ? అనేదే మిగిలిన కథ.అనేదే మిగిలిన కథ.

విశ్లేషణ…

ఒరేయ్ బుజ్జిగా అంటూ సాగే ఈ సినిమాలో హీరో రాజ్ తరుణ్ జీవించాడనే చెప్పలి.. ఎప్పటిలాగే ఫుల్ ఎంటర్మైంట్ ఇచ్చాడు… తన కామెడీ టైమింగ్ తో అందరిని నవ్వించాడు… ఎప్పటిలాగే ఒక ఊరిలో సరదాగా తిరిగే కుర్రాడి పాత్రకు రాజ్ తరుణ్ పూర్తి న్యాయం చేశాడు… ఇక హీరోయిన్ గా నటించిన మాళవిక నాయర్ కూడా ఆకట్టుకుంది…

తాను నాచురల్ ఆర్టిస్ట్ అని మళ్లీ ఈ చిత్రం ద్వారా నిరూపించుకుంది… తన నటనతో అందరిని ఆకట్టుకుంది… ఈ చిత్రంలో ప్రేమ సన్ని వేశాలతో పాటు కొన్ని భావోద్వేగాలు ఆకట్టుకున్నాయి… ఇక మరో హీరోయిన్ హెబ్బాకూడా తన నటనతో అందరిని ఆకట్టుకుంది…

కీలక పాత్రలో సప్తగి జనాలని నవ్వించడానికి చాలా కష్టపడ్డాడనే చెప్పాలి… పోసాని, నరేష్, తస్య తమ తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి… ఇక మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రలకు తగ్గట్లుగానే నటించారు… ఓవరాల్ గా చెప్పాలంటే చిత్రం బాగుందనే చెప్పాలి…

రేటింగ్… 2.5