మరో పోరాటానికి సిద్దమైన జగన్

మరో పోరాటానికి సిద్దమైన జగన్

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో పోరాటానికి సిద్దమవుతున్నారని వార్తలు వస్తున్నాయి… ఇటీవలే మంత్రివర్గ సమావేశంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.. మంత్రుల కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు అవినీతికి పాల్పడవద్దని జగన్ తెలిపారట..

ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుబంధ మీడియాలు మనపై ఫోకస్ పెట్టాయని జగన్ హెచ్చరించారట… తనకు మంత్రులందరితోను స్నేహం ఉందని అన్నారు…

కొంతమందిని అన్నా అని పిలుస్తానని మరికొంతమందిని తమ్ముడూ అని పిలుస్తాని మరికొందరిని అమ్మా అని పిలుస్తాని అందరికి ప్రెండ్లీగానే చెబుతున్నా ఎవ్వరూ అవినీతికి పాల్పడవద్దని సూచించారు…

గతంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్రంలో పారదర్శకత పాలన సాగిస్తున్నామని ఇందుకు అందరి సహకారం అవసరం అని పేర్కొన్నారు జగన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here