వైసీపీ ఎంపీ పై అసత్య ప్రచారం అంతా గాసిప్ వార్తలే

వైసీపీ ఎంపీ పై అసత్య ప్రచారం అంతా గాసిప్ వార్తలే

0
28

అప్పటి వరకూ ఆయన బీజేపీలో ఉన్నారు, తర్వాత సీటు పై ఏటూ తేల్చకపోవడంతో తర్వాత తెలుగుదేశం వైపు చూశారు. అయితే పార్టీ తరపున ఆయనకు సీటు కేటాయించలేదు, దీంతో ఆయన మళ్లీ కొన్ని సంవత్సరాలు టీడీపీలో పనిచేశారు. తర్వాత ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరిపోయారు. అంతేకాదు ఆయనకు జగన్ ఎంపీ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో సినిమా నటుడు నాగబాబు, అలాగే ప్రపంచ శాంతి దూత పాల్ ని సైతం ఓడించి, ఎంపీగా గెలుపొంది. హస్తిన బాట పట్టారు. ఆయనే నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామక్రుష్ణం రాజు.

అయితే వైసీపీ తరపున ఆయన కీలక నాయకుడిగా గోదావరి జిల్లాల్లో మారిపోయారు. ఆయనకంటూ ప్రత్యేకంగా క్షత్రియ సామాజికవర్గంలో మంచి పేరు కూడా ఉంది. వైసీపీ వేవ్స్ జగన్ పాలసీలు నచ్చి ఆయన ఎంపీగా గెలుపొందారు, అయితే రాజకీయంగా ఆయనకు అన్నీ పార్టీల్లోనూ మిత్రులు ఉన్నారు. కాని ఆయనకు బీజేపీలో మరింత మంది సన్నిహితులు ఉన్నారు.

అయితే రాజుగారికి ఇప్పుడు బీజేపీ వల వేస్తోంది అని వార్తలు వస్తున్నాయి.. ఆయనకు బీజేపీ వెల్ కం పలుకుతోందట.. దీనికి కారణం కూడా ఉంది. ఆయనకు గతంలో బీజేపీలో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయనని పార్టీలో చేర్చుకోవాలి అని చూస్తోంది. దీనకి ఎలాంటి అడ్డంకులు ఉండకుండా చూసుకుంటాము అంటున్నారు… అయితే వైసీపీ పై ఇప్పుడు బీజేపీ ఎందుకు ఫోకస్ చేసింది అనేది మాత్రం పెద్ద చర్చకు కారణం అయింది.

బీజేపీ ఏపీలో పాగా వేయాలి అని చూస్తోంది. అందుకే పార్టీ తరపున ఎవరైనా నేతలు వస్తారు అంటే, వారిని బీజేపీలో చేర్చుకోవాలి అని చూస్తోంది.. అయితే ఆయన పార్టీ మారేది లేదు అంటున్నారు. ఇవన్నీ జస్ట్ గాసిప్ వార్తలు అని ఆయన కేడర్ కూడా కొట్టిపారేస్తున్నారు.