అమ్మఒడి పథకానికి కొత్త నిబంధన 7 వరకూ టైం

అమ్మఒడి పథకానికి కొత్త నిబంధన 7 వరకూ టైం

0
26

ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్నారు. ఇక వచ్చే ఏడాది అమ్మఒడి పథకాన్ని ఏపీలో ప్రవేశపెడుతున్నారు.. ప్రతీ తల్లి ఖాతాలో 15 వేల రూపాయలు జమచేయనుంది ప్రభుత్వం. తాజాగా మరో కొత్త నిబంధన తీసుకువచ్చింది , మరి ఆ కొత్త నిబంధన ఏమిటో చూద్దాం.
విద్యాశాఖ ఉన్నత అధికారులు. తల్లుల వివరాలు విద్యార్దుల వివరాలు సరిగ్గా మ్యాచ్ అయ్యేలా చూడాలి అని తెలిపారు. అయితే తల్లి వేలిముద్ర సంతకం కొందరివి సరిగ్గా తీసుకోలేదట ఇవి కూడా మళ్లీ తీసుకోవాలి అని చెప్పారు అధికారులు.
సంతకాలు వేలిముద్రలు సరిగ్గా లేకపోవడం తల్లిపిల్లల డేటా లేకపోవడంతో కొన్ని ఫారాలు రిజక్ట్ అవుతున్నాయని అధికారులు తెలియచేస్తున్నారు
ఫారం-1లో పరిశీలించి తల్లి సంతకం లేదా వేలిముద్రను కూడా తీసుకోవాలని ఆదేశించారు. ఈ మొత్తం ప్రక్రియను ఈ నెల 7వ తేదీలోగా పూర్తిచేసి సోషల్ ఆడిట్ నిమిత్తం గ్రామ సచివాలయంలో పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇంకా ఈ పథకంలో కొందరి విషయంలో ఎలాంటి విషయం క్లారిటీ ఇవ్వడం లేదు అనాథ విద్యార్థి పేరున బ్యాంకు ఖాతా తెరవాలా లేక విద్యార్థి చదువుతున్న స్వచ్ఛంద సేవాసంస్ధ పేరున ఖాతా తెరవాలా అన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. వారికి డబ్బు ఎలా ఇస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎవరి ప్రాసెస్ అయితే పూర్తిగా జరగలేదో వారి వేలి ముద్రలు సంతకాలు మరోసారి తీసుకోవాలి అని చెబుతున్నారు అధికారులు.