ఏపీ స‌ర్కార్ కి షాకిచ్చిన , ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు

ఏపీ స‌ర్కార్ కి షాకిచ్చిన , ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు

0
37

ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు చాలా మంది ఇప్పుడు ఏపీలో ఏబీ స‌స్పెన్ష‌న్ గురించే చ‌ర్చించుకుంటున్నారు..ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ క్యాట్ ను ఆశ్రయించారు. అయితే రెండు రోజులుగా అంద‌రూ ఇదే అనుకున్నారు..

తాను న్యాయ‌ప‌రంగా ఈ విష‌యంపై తేల్చుకుంటాను అని చెప్పిన ఏబీ అనుకున్న‌దే చేశారు ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం పై ఆయ‌న ఫైర్ అయ్యారు,. తన సస్పెన్షన్ ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని పిటిషన్ వేశారు. గత ఏడాది మే నుంచి ఏపీ ప్రభుత్వం తనకు వేతనం కూడా చెల్లించడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు.

అంతేకాదు త‌న‌పై అనేక ఆరోప‌ణ‌లు చేస్తూ స‌స్పెండ్ చేశార‌ని తెలిపారు, రాజ‌కీయ ఒత్తిడితో త‌న‌పై స‌స్పెన్ష‌న్ వేశార‌ని దీనిని కొట్టివేసి కొత్త ఉత్త‌ర్వులు ఇవ్వాలి అని తెలిపారు, దీనిపై వాద‌న‌లు జ‌రుపుతున్నారు.