అమ్మ ఒడి పథకానికి కొత్త రూల్ – సీఎం జగన్

అమ్మ ఒడి పథకానికి కొత్త రూల్ - సీఎం జగన్

0
30

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన అన్ని హమీలు నెరవేరుస్తుంది. ఇక అమ్మ ఒడి పథకం కూడా రాష్ట్రంలో తల్లులకి అందించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా మేధోమథన సదస్సులను మన పాలన మీ సూచన పేరుతో నిర్వహిస్తున్నారు.

ఈ సమయంలో విద్యార్దులకి మంచి చదువు అందిస్తామని తెలిపారు, అన్నీ మౌళిక వసతులు స్కూల్లో ఏర్పాటు చేస్తాము అని తెలిపారు సీఎం జగన్, పుస్తకాలు బట్టలు మధ్యాహ్న భోజనం అన్నీ కల్పిస్తాం అన్నారు. ఈ సంవత్సరం ఆగష్టు నెల 3వ తేదీన పాఠశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు.

ఈ ఏడాది ఎలా అయితే అమ్మ ఒడి అందించారో అలాగే వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తానని చెప్పారు. అంతేకాదు మరో కీలక విషయం చెప్పారు, అమ్మఒడి పథకానికి ఈ సంవత్సరం హాజరుతో సంబంధం లేకుండా 15,000 రూపాయలు నగదు జమ చేశామని వచ్చేసారి మాత్రం విద్యార్దులకి 75 శాతం హాజరు ఉండాలని తెలిపారు.