బ్రేకింగ్ – 3 రాజ‌ధానులు ముహూర్తం ఫిక్స్ డేట్ ఎప్పుడంటే

బ్రేకింగ్ - 3 రాజ‌ధానులు ముహూర్తం ఫిక్స్ డేట్ ఎప్పుడంటే

0

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో దూసుకుపోతున్నారు,అలాగే ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చట్టం చేసింది. మ‌రి విశాఖకు రాజ‌ధాని ఎప్పుడు త‌ర‌లిస్తారు, ఎప్పుడు అక్క‌డ నుంచి ప‌రిపాల‌న చేస్తారు అనేదానిపై అనేక చర్చ‌లు జ‌రుగుతున్నాయి.

హైకోర్టు తాజాగా ఆగస్టు 14 వరకూ స్టేటస్ కో ఇచ్చింది. అందుకే కాస్త ఆలస్యం అయ్యింది అంటున్నారు ఉన్న‌త ఉద్యోగులు..ఈనెల 16న ఈ మూడు రాజధానుల శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వ‌హించాలి అని సీఎం జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌.

అంతేకాదు ఆ కార్యక్రమంలో ప్రత్యక్షంగా గానీ, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గానీ పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు సీఎం జగన్‌ మోదీ అపాయింట్‌మెంట్‌ కోరారు.. మ‌రి ఈ కరోనా స‌మ‌యంలో ప్ర‌ధాని వ‌స్తారా లేదా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొంటారా అనేది చూడాలి.