ఈ కృష్ణాష్ట‌మి రోజున ఈ ప‌ని చేస్తే 100 జ‌న్మ‌ల పుణ్యం క‌లుగుతుంది

ఈ కృష్ణాష్ట‌మి రోజున ఈ ప‌ని చేస్తే 100 జ‌న్మ‌ల పుణ్యం క‌లుగుతుంది

0
75

శ్రీ కృష్ణుని జన్మదిన పండుగను ఆ నాడు త‌ల్లిదండ్రులు వసుదేవులు కంసుని కారాగారంలో ఉండి బ‌య‌ట‌కు రాలేక జ‌రుపుకోలేదు, తర్వాత శ్రీకృష్ణుడు బృందావనం నుండి మథురకు వచ్చి కంసుని వధించి, తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను చెర విడిపించిన తర్వాత, కృష్ణాష్టమి ఉత్సవాన్ని, వ్రతాన్ని జ‌రుపుకున్నారు.

మొద‌ట‌గా మ‌ధుర‌లో దీనిని జ‌రిపించారు, అందుకే ఇక్క‌డ వేడుక‌లు ఎంతో కోలాహ‌లంగా జ‌రుగుతాయి
కృష్ణాష్టమి ఉత్సవాన్ని, వ్రతాన్ని ఎనిమిదేండ్ల నుండి ఎనభై ఏండ్ల వయస్సున్న ప్రతి ఒక్కరూ చేయ‌వ‌చ్చు.

ఈరోజు ఉపవాసం ఉంటారు, అలాగే ఒంటిప‌ద్దు ఉండేవారు ఉంటారు, పాలు పండ్లు ఆహారంగా తీసుకోవ‌చ్చు, ధాన్యాన్ని తీసుకోరు.. ఈ వ్రత మహిమవల్ల ‌ సంతానం, ఆరోగ్యభాగ్యాలు కలుగుతాయని, అంతేకాకుండా, త్రికరణ శుద్ధిగా ఈ వ్రతాన్ని చేసేవారికి వైకుంఠ ప్రాప్తి తథ్యమని కూడా చెబుతారు
అర్ధరాత్రి వరకు కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొని రాత్రంతా జాగరణ చేసేవారికి సంసార భయమే ఉండదు.
వ్యాపారం ఉద్యోగం విద్య అన్నీంటిలో వారు తిరుగులేకుండా ఉంటారు, ఆ రోజు కృష్ణ చ‌రిత్ర‌ను చ‌దువుకుంటే చాలు నూరు జ‌న్మ‌ల ఫ‌లం కలుగుతుంది.