సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

0

ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని జాతీయ ఇంజనీర్స్ డే గా జరుపుకుంటున్న సందర్భంగా నవభారత నిర్మాణం కోసం కృషి చేస్తోన్న ఇంజనీరింగ్ నిపుణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

తెలుగుదేశం ప్రభుత్వానికి పేరుతెచ్చిన ఇలాంటి ఎన్నో నిర్మాణాలకు తమ ప్రతిభను అందించిన ఇంజనీరింగ్ నిపుణుల ఋణం తీర్చలేనిదని అన్నారు… అలాంటిది ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వచ్చాక నిలిచిపోయిన ప్రాజెక్టులను చూస్తే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆత్మ ఘోషిస్తుందా అనిపిస్తోందని అన్నారు…

ఎందుకంటే కక్షతో ప్రాజెక్టులు నిలిపేసి ఇంజనీర్ల, కార్మికుల ఉపాధి పోగొట్టడం ఇంజనీరింగ్ ద్రోహం. ఇప్పటికైనా పాలకులు తెలుగుదేశం హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు, పేదల ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here