బిగ్ బాస్ 4 కు నాగార్జున 4 వారాలు బ్రేక్ ? మరి ఎవరు వస్తారు?

0

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 సరికొత్తగా సాగుతోంది, అయితే ఈసారి కొత్త కంటెస్టెంట్లు హౌస్ లో ఉన్నారు.. ఫుల్ ఖుషీ జోష్ కనిపిస్తోంది, ఇక శనివారం ఆదివారం వీకెండ్స్ లో కింగ్ నాగార్జున టాస్కులు క్లాస్ పీకడాలు అందరికి నచ్చుతున్నాయి.

అయితే ఇప్పుడు నాగార్జున బిగ్ బాస్ కు కొద్ది రోజులు బ్రేక్ ఇవ్వనున్నారట, దీనికి కారణం ఆయన ఓ సినిమా షూటింగ్ కు వెళుతున్నారు అని వార్త వినిపిస్తోంది.సోలోమన్ దర్శకత్వంలో వైల్డ్ డాగ్ అనే చిత్రం తెరకెక్కుతోంది.

ఈ చిత్రంలో నాగార్జున నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. త్వరలోనే థాయ్ లాండ్ లో కీలకమైన షెడ్యూల్ ని షూట్ చేయనున్నారు. అయితే మూడు వారాలు ఈ సినిమా షూటింగ్ ఉంటుంది సుమారు 20 రోజుల వరకూ నాగ్ ఇక్కడ ఉండరు అని అంటున్నారు, ఈ సమయంలో హౌస్ లోకి వారానికి ఒకరిని లేదా 4 వారాలు ఎవరిని అయినా హోస్ట్ గా పంపాలి అని చూస్తున్నారట, రమ్యకృష్ణ లేదా మరెవరిని అయినా షో రన్ చేసేలా చూస్తారు అని తెలుస్తోంది. మరి ఇది ఎంత వరకూ నిజమో అనేది కూడా చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here