నూడుల్స్ తిని కుటుంబంలో 9 మంది మృతి- ఇలాంటివి తింటే ప్రాణాలు పోతాయి

-

నూడుల్స్ చాలా మంది ఇష్టంగా తింటారు, అయితే నిలువ ఉన్న నూడిల్స్ తింటే బతకడం కష్టం అంటున్నారు వైద్యులు, మరీ ముఖ్యంగా తాజాగా జరిగిన ఘటన అందరిని షాక్ కి గురిచేసింది.నూడుల్స్ తిని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. మొత్తం 12 మంది సభ్యుల్లో తొమ్మిది మంది కన్నుమూశారు. చైనాలోని హీలాంగ్జియాంగ్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

అయితే నూడిల్స్ తింటే ఎలా చనిపోయారు అని మీరు అనుకోవచ్చు, సంవత్సరం కింద ఆ వంటకాన్ని తయారు చేశారు. దాన్ని అప్పటి నుంచీ ఫ్రిజ్లో ఉంచారు. అక్టోబరు 5న బయటకు తీసి 9 మంది తిన్నారు. ఫుడ్ పాయిజన్ కావడంతో అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదు, అయితే ముగ్గురు పిల్లలు ఇది నచ్చక తినలేదు వారు ప్రాణాలు దక్కించుకున్నారు.

బాంగ్క్రెకిక్ యాసిడ్ అనే విషం కారణంగానే వారంతా చనిపోయారని.. చెడిపోయిన, కుళ్లిపోయిన ఆహార పదార్థాల్లో ఇది ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు వైద్యులు. పులియబెట్టిన ఆహారంలో ఇది ఉంటుంది, అయితే వారు ఎలా తిన్నారు అనేది ఇంకా విచారణలో ఉంది, సంవత్సరం క్రితం నూడిల్స్ అని తేలింది, ఇది తింటే కడుపునొప్పి తీవ్రంగా ఉంటుంది, ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది, అంతేకాదు దీనికి విరుగుడు మందు లేదు అంటున్నారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జగన్ మనోవేదన మీకు గుర్తుకు రాలేదా? సౌభాగ్యమ్మకు అవినాశ్ తల్లి కౌంటర్

ఏపీలో ఎన్నికల వేళ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులు తీవ్ర...

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...